
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO భారతీయ మార్కెట్ లో POCO C50, POCO C51, POCO C55, POCO X5, POCO X5 Pro, POCO F5 అనే ఫోన్లను ఈ ఏడాది లాంచ్ చేసింది. పోకో ఇండియా హెడ్, హిమాన్శు టాండన్ తాజాగా 5-నంబర్డ్ సిరీస్ ఫోన్ల లాంచ్ ముగిసిందని తెలిపారు. అలాగే ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా 6-నంబర్డ్ ఫోన్ గురించి హింట్ ఇచ్చారు.
Redmi Note 12R కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Pro 5G భారత్ లోకి రానుందని రీసెంట్ గా టిప్‌స్టర్ Kacper Skrzypek వెల్లడించారు. POCO M6 Pro 5G హ్యాండ్సెట్ ఐఎంఈఐ డేటాబేస్ పై 23076PC4B1 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. మరోవైపు టిప్‌స్టర్ హిమాన్శు టాండన్ ఫోన్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. డివైజ్ Redmi Note 12R కి రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే కంపెనీ నుంచి అధికార ప్రకటన వస్తే గాని ఏమీ తెలియదు. కానీ, రానున్న రోజుల్లో రివీల్ అయ్యే స్పెసిఫికేషన్స్ తో ఈ విషయం పై క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు. సరే ఇప్పుడు ఓసారి Redmi Note 12R స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.
We believe in having a lean and mean portfolio. POCO '5' Series had – C50, C51, C55, M5, X5, X5 Pro and F5 which gave us tremendous growth in the first half of this year.
It's time to move to the '6' series now!! #ComingSoon
— Himanshu Tandon (@Himanshu_POCO) July 19, 2023
Redmi Note 12R స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Note 12R లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 12R లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 12R లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది.
- ఓఎస్: Redmi Note 12R స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Redmi Note 12R డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా వివరాలు ఇంకా తెలియదు.
- బ్యాటరీ: Redmi Note 12R డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi Note 12R లో 5జీ, డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Redmi Note 12R డివైజ్ మిడ్నైట్ బ్లాక్, టైమ్ బ్లూ, స్కై ఇల్యూషన్ రంగుల్లో లభిస్తుంది.











