
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO గ్లోబల్ మార్కెట్ లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటోంది. తాజాగా ఈ సంస్థ ఇండోనేషియా మార్కెట్ లో OPPO A58 4G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చింది. అయితే భారత మార్కెట్ లో OPPO A58 4G లాంచ్ పై ఇంకా స్పష్టత రాలేదు. సరే, ఓసారి OPPO A58 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO A58 4G ధర
OPPO A58 4G డివైజ్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. అక్కడ కేవలం 6జిబి+128జిబి సింగిల్ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. ఈ డివైజ్ ధర అక్కడ IDR 25,00,000 గా ఉంది. అంటే మన కరెన్సీలో ధర దాదాపుగా రూ.13,500 ఉంటుంది. ఇకపోతే OPPO A58 4G డివైజ్ షైనింగ్ బ్లాక్, లూమినస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO A58 4G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO A58 4G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
- కెమెరా: OPPO A58 4G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
- ప్రాసెసర్: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 జీపీయూ వినియోగించారు.
- ఓఎస్: OPPO A58 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో 6జిబి ఫిజికల్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ: OPPO A58 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO A58 4G డివైజ్ లో డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్సీ, ఐపీx4 రేటింగ్ ఉంటాయి.











