వన్‌ప్లస్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ పేరు ‘OnePlus Open’; ట్వీట్ చేసిన కంపెనీ!

Highlights

  • తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్
  • OnePlus Open అనే పేరుతో వస్తోన్న ఫోల్డబుల్ ఫోన్
  • వచ్చే నెలలో డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలోనే తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఏడాది లోనే ఈ డివైజ్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఫోన్ పేరు OnePlus Fold, OnePlus V Fold అని ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే తాజాగా మరొక పేరు వెలుగులోకి వచ్చింది. అదే, OnePlus Open, వన్‌ప్లస్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ పేరు వన్‌ప్లస్ ఓపెన్ అని ఖరారు చేసినట్లు సమాచారం.

OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ వివరాలు

వన్‌ప్లస్ సంస్థ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ పేరుని ఖరారు చేసింది. కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో “వీ ఓపెన్ వెన్ అదర్స్ ఫోల్డ్” అని ట్వీట్ చేసింది. బుధవారం నాడు శాంసంగ్ సంస్థ తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసిన సమయంలోనే వన్‌ప్లస్ ఈ ట్వీట్ చేసింది. దీంతో OnePlus Open అనేది సదరు సంస్థ తొలి ఫోల్డబుల్ ఫోన్ పేరని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వన్‌ప్లస్ నుంచి అధికార ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

OnePlus Open లాంచ్ టైమ్‌లైన్

వన్‌ప్లస్ సంస్థ OnePlus Open గురించి తన అధికార ప్రకటనను వెలువరించలేదు. కానీ, వచ్చే నెల ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వన్‌ప్లస్ నుంచి అఫీషియల్ టీజర్ కూడా రాలేదు. ఈ తరుణంలో, ఇంత త్వరగా ఫోన్ లాంచ్ అవుతుందంటే నమ్మశక్యంగా లేదు. అయితే రానున్న రోజుల్లో ఏదైనా జరగవచ్చు.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open డివైజ్ లో 7.8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కవర్ స్క్రీన్: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో జీపీయూ వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Open లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. కవర్ స్క్రీన్ పై 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక ఫోన్ లోపల స్క్రీన్ పై 20ఎంపి సెన్సర్ ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleSnapdragon 778G చిప్‌, 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌పై కనిపించిన Vivo V29 5G
Next article50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన OPPO A58 4G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.