
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలోనే భారత్ లో ఎమ్-సిరీస్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. POCO M6 Pro 5G అనే పేరుతో వస్తోన్న ఈ ఫోన్ చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Note 12R 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO M6 Pro 5G డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. POCO M6 Pro 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ తో వస్తోంది.
రివీలైన POCO M6 Pro 5G డిజైన్
POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా. పోకో సంస్థ ఇంకా ఈ డివైజ్ లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈలోపు కంపెనీ ఈ ఫోన్ యొక్క రియర్ ప్యానెల్ డిజైన్ ని రివీల్ చేసింది. POCO M6 Pro 5G డివైజ్ డ్యూయల్-టోన్ బ్యాక్ తో వస్తోంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ యొక్క పై భాగం రెక్టాంగ్యులర్ షేప్ లో బ్లాక్డ్ ఔట్ గా కనిపిస్తోంది. ఈ ఏరియా లోనే డ్యూయల్-కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. టాప్ రైట్ కార్నర్ లో పోకో లోగో ఉంది. ఈ డివైజ్ సైయన్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సిమ్ ట్రే ఫోన్‌కి ఎడమ వైపు ఎడ్జ్ పై ఉంది.
POCO M6 Pro 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: POCO M6 Pro 5G లో ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ, చార్జింగ్: POCO M6 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
- ఇతర ఫీచర్లు: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో ఫింగర్-ప్రింట్ స్కానర్, ఐపీ53 రేటింగ్, సింగిల్ స్పీకర్ సెటప్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1 వంటి ఫీచర్లు ఉంటాయి.
- కొలతలు, బరువు: POCO M6 Pro 5G డివైజ్ 199 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 168.6 మి.మీ పొడవు, 76.28 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం ఉంటుంది.











