
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాలో OPPO A78 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. త్వరలోనే ఈ మిడ్-రేంజ్ ఒప్పో ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంటర్ కానుంది. తాజాగా కంపెనీ OPPO A78 డివైజ్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసింది.
OPPO A78 4G ఇండియా లాంచ్ వివరాలు
తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒప్పో సంస్థ OPPO A78 డివైజ్ ని టీజ్ చేసింది. కమింగ్ సూన్ అని రాసి OPPO A78 ఫోన్ పిక్ ని షేర్ చేసింది. అయితే లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కానీ, ఆగస్టు 15 లోపే భారతీయ మార్కెట్ లో OPPO A78 డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
? Get ready to experience #EndlessEntertainment with the all-new OPPO A78! ?
Stay tuned to take your entertainment to a whole new level! ???#OPPOA78 #ComingSoon pic.twitter.com/eZEatK5fM0— OPPO India (@OPPOIndia) July 30, 2023
భారత్ లో OPPO A78 4G ధర
భారత్ లో OPPO A78 రూ.17,499 ధరకి లభించనుందని రిటైల్ వర్గాల ద్వారా 91మొబైల్స్ కి సమాచారం అందింది. గతంలో లాంచైన OPPO F21s Pro 4G ని OPPO A78 డివైజ్ రిప్లేస్ చేయనుంది. కంపెనీ స్వయంగా OPPO F21s Pro 4G స్టాక్స్ ని ఖాళీ చేయాలని రిటైలర్స్ కి చెబుతున్నట్లు తెలిసింది.
OPPO A78 4G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- స్క్రీన్: OPPO A78 4G డివైజ్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
- ఓఎస్: OPPO A78 4G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- చిప్సెట్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ లభించనుంది.
- కెమెరా: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO A78 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: OPPO A78 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.











