రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్

Highlights

  • టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోన్న ఎయిర్టెల్
  • రకరకాల ధరల శ్రేణిలో ప్లాన్స్ ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్
  • రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్

భారతదేశంలో ఉన్న టెలీకామ్ కంపెనీల్లో టాప్ 2 ప్లేస్ లో ఎయిర్టెల్ కొనసాగుతోంది. మొదటి స్థానంలో జియో ఉంది. ఎయిర్టెల్ సంస్థ తన కస్టమర్ల కోసం వివిధ ధరల శ్రేణుల్లో రీచార్జ్ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి రూ.300 లోపు ధరలో బోలెడన్ని ప్రీపెయిడ్ ప్లాన్ రీచార్జ్ ఆప్షన్స్ ఎయిర్టెల్ వద్ద ఉన్నాయి. కస్టమర్ తన బడ్జెట్ అనుసారం, నచ్చిన ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ లో రూ.300 లోపు ధరలో పైసా వసూల్ ప్లాన్స్ ఏవి ఉన్నాయో తెలియజేస్తున్నాం. వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ కి యూజర్లలో ఎప్పుడూ కూడా మాంచి గిరాకీ ఉంటుంది. కానీ, వీటిని సరిగ్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రయోజనాలను కోల్పేయే అవకాశం ఉంది. డేటా, వ్యాలిడిటీ, ఉచిత కాలింగ్.. ఇలా మీరు దేనికి అధిక ప్రాధాన్యతనిస్తారో.. దానికి అనుగుణంగా ప్లాన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సరే, పదండి, అలా రూ.300 లోపు ధరలో ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవి ఉన్నాయో తెలుసుకుందాం.

రూ.300 లోపు ధరలో లభించే బెస్ట్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్

1. రూ.299 ప్లాన్
2. రూ.296 ప్లాన్
3. రూ.289 ప్లాన్
4. రూ.265 ప్లాన్
5. రూ.239 ప్లాన్
6. రూ.209 ప్లాన్
7. రూ.199 ప్లాన్
8. రూ.179 ప్లాన్
9. రూ.155 ప్లాన్

  • రూ.299 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోన్న రూ.299 ప్లాన్ ద్వారా యూజర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, 1.5జిబి డెయిలీ డేటా, అపరిమిత కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభిస్తాయి.

  • రూ.296 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోన్న రూ.296 ప్లాన్ ద్వారా 25జిబి డేటా, అపరిమిత కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.289 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోన్న రూ.289 ప్లాన్ ద్వారా 35 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి. అధిక వ్యాలిడిటీ కావాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

  • రూ.265 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.265 ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డెయిలీ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత 5జీ డేటా, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.239 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.239 ప్లాన్ ద్వారా 24 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డెయిలీ డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5జీ డేటా, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.209 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.209 ప్లాన్ ద్వారా 21 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.199 ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ, 3జిబి డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్, రూ.5 టాక్‌టైమ్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.179 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోన్న రూ.179 ప్లాన్ ద్వారా యూజర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, 2జిబి డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.155 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.155 ప్లాన్ ద్వారా 24 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.