Realme C51 లాంచ్‌ని టీజర్ ద్వారా ఖరారు చేసిన కంపెనీ

Highlights

  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన Realme C51
  • 33W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్
  • భారత్ లో Realme C51 ధర రూ.15,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే ఒక చవకైన స్మార్ట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Realme C51 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. తాజాగా రియల్మీ కంపెనీ Realme C51 ఇండియా లాంచ్ ని ప్రకటించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఐఫోన్ లో మాదిరి డైనమిక్ ఐల్యాండ్ స్క్రీన్ Realme C51 లో కనిపించనుంది. సరే, Realme C51 యొక్క కొత్త టీజర్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme C51 ఇండియా లాంచ్ టీజర్

రియల్మీ కంపెనీ నేడు Realme C51 యొక్క కొత్త టీజర్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేసింది. ఆ పోస్ట్ లో ద ఛాంపియన్ ఈజ్ కమింగ్ అని రాసి ఉంది. ఐఫోన్ లో మాదిరి నాచ్ స్క్రీన్ ని Realme C51 లో చూడవచ్చు.

Realme C51 ధర (అంచనా)

Realme C51 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. దీంతో ధరను అంచనా వేయడం సులభమవుతోంది. తైవాన్ లో లాంచైన Realme C51 యొక్క బేస్ మోడల్ ధర రూ.10,430 గా ఉంది. భారత్ లో ఈ ఫోన్ రూ.15,000 లోపు ధరతో తీసుకురానున్నట్లు సమాచారం.

Realme C51 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Realme C51 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ ఉండనుంది. ఇది 12 ఎన్ఎమ్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • స్టోరేజీ: Realme C51 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 2టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Realme C51 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme C51 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
Previous articleGoogle సర్వీసెస్ తో భారత్‌లో లాంచ్ కానున్న Honor 90
Next articleRealme GT 5 గ్లోబల్ లాంచ్ ఖరారు; రిలీజైన టీజర్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.