భారత్ లో లాంచైన Tecno Camon 20 Avocado Art ఎడిషన్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • అందుబాటులోకి వచ్చిన Tecno Camon 20 Avocado Art ఎడిషన్
  • గ్రీన్ కలర్, ప్రీమియమ్ లెదర్ ఫినిష్ తో వచ్చిన డివైజ్
  • Tecno Camon 20 Avocado Art ధర రూ.15,999

Tecno Camon 20 Avocado Art భారత్ లో లాంచ్ అయ్యింది. ఫంకీ డిజైన్ తో యువతని ఆకట్టుకునే విధంగా ఫోన్ ఉంది. రెగ్యులర్ వర్షన్ ఫోన్ తో పోల్చితే అవకాడో వర్షన్ పూర్తిగా డిఫరెంట్ లుక్ తో ఉంది. తమ ఫోన్ యూనిక్ లుక్ తో ఉండాలని భావించే వారికి ఈ డివైజ్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. సరే, ఓసారి Tecno Camon 20 Avocado Art ఎడిషన్ స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు తెలుసుకుందాం.

భారత్ లో Tecno Camon 20 Avocado Art ధర

  • Tecno Camon 20 Avocado Art డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది.
  • అమెజాన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా Tecno Camon 20 Avocado Art డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.

Tecno Camon 20 Avocado Art ఎడిషన్ డిజైన్

  • Tecno Camon 20 Avocado Art స్పెషల్ ఎడిషన్ కూల్ గ్రీన్, ప్రీమియమ్ లెదర్ ఫినిష్ బ్యాక్, ఎంబాస్డ్ టెక్షర్, ఆర్టిస్టిక్ గ్రాఫిటి తో వచ్చింది. డిజైన్ పక్కనబెడితే, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ అన్నీ రెగ్యులర్ మోడల్ మాదిరే ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ కలర్, బ్యాక్ ప్యానెల్ పై ఉన్న ఎంబాస్డ్ లెదర్ ని పోలి ఉంది.
  • Tecno Camon 20 స్మార్ట్ ఫోన్ సెరినిటీ బ్లూ మరియు ప్రీడాన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Camon 20 Avocado Art ఎడిషన్ స్పెసిఫికేషన్స్

స్టాండర్డ్ ఎడిషన్ ఫోన్ లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో అవే Tecno Camon 20 Avocado Art లో కూడా ఉంటాయి.

  • స్క్రీన్: Tecno Camon 20 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Tecno Camon 20 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 2ఈఈఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Camon 20 స్మార్ట్ ఫోన్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది.
  • ఓఎస్: Tecno Camon 20 అవకాడో ఆర్ట్ ఎడిషన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Camon 20 అవకాడో ఆర్ట్ ఎడిషన్ లో 64ఎంపి ప్రైమరీ ఆర్జీబీడబ్ల్యూ సెన్సర్, పీడీఏఎఫ్, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఏఐ కెమెరా ఉన్నాయి. క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ కూడా అందించారు.
  • కనెక్టివిటీ: Tecno Camon 20 డివైజ్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Tecno Camon 20 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Camon 20 స్మార్ట్ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.