Samsung Galaxy S24 Plus: అప్‌గ్రేడ్ కానున్న డిస్ప్లే?

Highlights

  • వచ్చే ఏడాది లాంచ్ కానున్న Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో భాగంగా రానున్న S24, S24+, S24 Ultra
  • మెరుగైన డిస్ప్లేతో రానున్న Samsung Galaxy S24+

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung వచ్చే ఏడాది తన ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Ultra. అయితే తాజాగా Samsung Galaxy S24+ కి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మోడల్ డిస్ప్లేకి మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

మరింత మెరుగైన డిస్ప్లేతో రానున్న Samsung Galaxy S24+

  • ప్రముఖ టిప్‌స్టర్ @IceUniverse ప్రకారం, Samsung Galaxy S24 సిరీస్ లోని 3 ఫోన్లు కూడా 2500 నిట్స్ మ్యాక్జిమమ్ బ్రైట్నెస్ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • ఇక Samsung Galaxy S24+ విషయానికి వస్తే, ఇది 3120 * 1440 WQHD+ రెజుల్యూషన్ డిస్ప్లేతో రానున్నట్లు సమాచారం.
  • ఇది వరకు వచ్చిన 2340*1080 స్క్రీన్స్ స్థానంలో లేటెస్ట్ రెజుల్యూషన్ డిస్ప్లేస్ రానున్నాయి.
  • అసలైతే, శాంసంగ్ సంస్థ తన ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లేస్ ని Ultra వేరియంట్ లో మాత్రమే అందించేది. కానీ, ఈసారి మనం మరింత ప్రకాశవంతమైన, స్పష్టమైన స్క్రీన్స్ ని ప్లస్ మరియు స్టాండర్డ్ వేరియంట్స్ లో చూడవచ్చు.

Samsung Galaxy S24+ రెండర్

  • డిస్ప్లే వివరాలతో పాటు, @IceUniverse Samsung Galaxy S24+ యొక్క రెండర్ ని కూడా లీక్ చేసింది. దాని ప్రకారం, 2.5మి.మీ సైజ్ మిడిల్ ఫ్రేమ్, 1.0 మి.మీ బెజెల్స్ ఉన్నట్లు అర్థమవుతోంది.
  • ఇకపోతే Samsung Galaxy S24+ డివైజ్ 195 గ్రాముల బరువు, 7.7 మి.మీ మందం ఉంటుంది.
  • మార్పులు, చేర్పులను చూస్తుంటే ఈసారి Samsung Galaxy S24+ అమ్మకాలు బాగానే జరుగుతాయని అంచనా వేయవచ్చు.

Samsung Galaxy S24+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24+ లో 6.65-ఇంచ్ 2ఎక్స్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది.
  • చిప్సెట్: Samsung Galaxy S24+ లో ఎగ్జినోస్ 2400 చిప్ మరియు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్స్ వాడతారని అంచనా. ప్రాంతాలను బట్టి ప్రాసెసర్స్ మారతాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S24+ లో 8జిబి ర్యామ్ ఉంటుంది. ఇతర ర్యామ్ వేరియంట్ కూడా ఉండే చాన్స్ ఉంది. స్టోరేజీ విషయానికి వస్తే, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయని అంచనా.
  • బ్యాటరీ: Samsung Galaxy S24+ స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4855 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోందని రీసెంట్ గా రూమర్లు వినిపించాయి.
  • ఓఎస్: Samsung Galaxy S24+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేయనుంది.
  • ఫ్రేమ్: Samsung Galaxy S24 సిరీస్ టైటానియమ్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు సమాచారం.