బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Honor 90; త్వరలోనే భారత్ లో లాంచ్!

Highlights

  • REA-NX9 మోడల్ నంబర్‌తో బీఐఎస్ పై కనిపించిన Honor 90
  • బీఐఎస్ ద్వారా రివీల్ కాని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్
  • త్వరలోనే Honor 90 ఇండియా లాంచ్ తేదీ ప్రకటన

ఈసారి Honor సంస్థ భారత మార్కెట్ లోకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రీఎంట్రీలో Honor 90 తో హానర్ కంపెనీ భారత్ కి రాబోతోంది. మాధవ్ షేత్ హానర్ ఇండియాకి నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన రియల్మీ ఇండియా బాధ్యతలు చూసేవారు. ఇప్పుడు సెప్టెంబర్ లాంచ్ కి ముందు Honor 90 డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందింది. REA-NX9 అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై Honor 90 కనిపించింది. దీంతో అతి త్వరలో Honor 90 లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన Honor 90

  • Honor 90 డివైజ్ ని బీఐఎస్ లిస్టింగ్ పై తొలుత టిప్‌స్టర్ ముకుల్ శర్మ గుర్తించారు. అయితే హానర్ బ్రాండింగ్, మోడల్ నంబర్ తప్పితే లిస్టింగ్ ద్వారా ఇంకా ఏమీ రివీల్ కాలేదు.
  • భారత్ లో లాంచ్ కాబోవు Honor 90 స్మార్ట్ ఫోన్ మ్యాప్స్, క్రోమ్ వంటి తదితర గూగుల్ యాప్స్ తో వస్తుందని మాధవ్ షేత్ స్పష్టం చేసారు.
  • Honor 90 స్మార్ట్ ఫోన్ 2 మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ పొందుతుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అలాగే ప్రీ-ఇన్‌స్టాల్డ్ బ్లోట్‌వేర్ యాప్స్ ఉండబోవని తెలిపింది.
  • భారత్ లో Honor 90 ధర రూ.40,000 వద్ద ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి.
  • Honor 90 గ్లోబల్ వేరియంట్ కి ఇండియన్ వర్షన్ కి తేడా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
  • భారత్ లో Honor 90 డివైజ్ సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది. అయితే కచ్చితమైన తేదీ ఇంకా తెలియదు. త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఓసారి హానర్ 90 డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor 90 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840Hz హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
  • చిప్సెట్: Honor 90 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ (4ఎన్ఎమ్) చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Honor 90 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor 90 డివైజ్ లో 200ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • కనెక్టివిటీ: Honor 90 స్మార్ట్ ఫోన్ లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉంటాయి.
  • బ్యాటరీ: Honor 90 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articleSamsung Galaxy S24 Plus: అప్‌గ్రేడ్ కానున్న డిస్ప్లే?
Next articleలాంచ్‌కి ముందు లీకైన Motorola Edge 40 Neo వీడియో
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.