
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా ఒక కొత్త ఫోన్ ని మార్కెట్ లో లాంచ్ చేసింది. Oppo A38 అనే పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూఏఈ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో యూఏఈ వెబ్ సైట్ లో కనిపించింది. లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. అయితే కంపెనీ Oppo A38 డివైజ్ యొక్క ధర, లభ్యత గురించి తెలియజేయలేదు. సరే, ఓసారి Oppo A38 స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Oppo A38 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- స్క్రీన్: Oppo A38 డివైజ్ లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్ (720*1612 పిక్సెల్స్), 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3, 100 పర్సెంట్ ఎస్ఆర్జీబీ కలర్ గేముత్, వాటర్ డ్రాప్ నాచ్, 89.90 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి.
- కెమెరా: Oppo A38 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియర్ కెమెరాలు 30ఎఫ్పీఎస్ 1080పి వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
- చిప్సెట్: Oppo A38 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Oppo A38 స్మార్ట్ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.
- బ్యాటరీ: Oppo A38 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Oppo A38 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Oppo A38 ధర, లభ్యత
Oppo A38 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధరను ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అవి: గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్. Oppo A38 ఫోన్ భారత్ తో సహా ఇతర ఆసియా మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది.











