6,000mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Moto G54 5G

Highlights

  • మిడ్-రేంజ్ 5జీ డివైజ్ గా వచ్చిన Moto G54 5G
  • భారత్ లో Moto G54 5G ప్రారంభ ధర రూ.15,999
  • సెప్టెంబర్ 13 నుంచి Moto G54 5G సేల్ ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G54 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. సరే, ఓసారి Moto G54 5G డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto G54 5G ధర, సేల్ వివరాలు

  • Moto G54 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.15,999 గా నిర్ణయించారు.
  • ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. లేదంటే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా రూ.1,500 డిస్కౌంట్ లభించనుంది.
  • Moto G54 5G కొనుగోలుపై రిలయన్స్ జియో కస్టమర్లకు రూ.5,000 విలువజేసే ప్రయోజనాలు లభిస్తాయి.
  • Moto G54 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా లభిస్తుంది. దీని ధర రూ.18,999 గా ఉంది. అన్ని ఆఫర్లు ఈ వేరియంట్ పై కూడా వర్తిస్తాయి.
  • ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సెప్టెంబర్ 13 నుంచి Moto G54 5G ని కొనుగోలు చేయవచ్చు.
  • Moto G54 5G స్మార్ట్ ఫోన్ మిడ్నైట్ బ్లూ, పర్ల్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G54 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto G54 5G డివైజ్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G54 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G54 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G54 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ లెన్స్ లో మ్యాక్రో మరియు డెప్త్ ఫీచర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Moto G54 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Moto G54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ అప్డేట్ కూడా పొందుతుంది. ఇంకా 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.
  • ఇతర ఫీచర్లు: Moto G54 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డాల్బి అట్మాస్, స్టీరియ్ స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous article50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన Realme Narzo 60x 5G; ధర తక్కువే!
Next articleAirtel 5G Plans: బెస్ట్ ఎయిర్టెల్ 5జీ ప్లాన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.