
కొత్త Realme 5G ఫోన్ ఈరోజు భారతదేశంలో లాంచ్ చేయబడింది. భారతీయ మార్కెట్లో రియల్మీ నార్జో 60x 5Gని పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన ‘నార్జో’ సిరీస్ ని విస్తరించినట్లైంది. ఈ మొబైల్ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ మరియు 12GB వరకు RAM తో మార్కెట్ లోకి ప్రవేశించింది. Realme Narzo 60X 5G ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.
Realme యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ Narzo 60X 5G భారతదేశంలో రెండు ర్యామ్ వేరియంట్‌లలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ 4జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజీని కలిగి ఉంది. దీని ధర రూ. 12,999. ఫోన్ యొక్క టాప్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. దీని ధరను రూ. 14,499 గా నిర్ణయించారు. Realme Narzo 60x 5G ఫోన్ సెప్టెంబర్ 15 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీనిని స్టెల్లార్ గ్రీన్ మరియు నెబ్యులా పర్పుల్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ లో చక్కటి ఫీచర్లతో కూడిన ఫోన్ కోసం చూసే వారికి ఈ డివైజ్ సరైన ఎంపిక కావచ్చు. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Realme Narzo 60x 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Realme Narzo 60x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme Narzo 60x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 60x 5G లో 6జిబి ఫిజికల్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్ కి మొత్తం 12జిబి ర్యామ్ లభిస్తుంది. ఇంకా 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Realme Narzo 60x 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme Narzo 60x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Realme Narzo 60x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Realme Narzo 60x 5G డివైజ్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉన్నాయి.











