సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోన్న Tecno Phantom V Flip

Highlights

  • ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేయనున్న టెక్నో సంస్థ
  • ఈ నెల 22 న ఎంట్రీ ఇవ్వనున్న Tecno Phantom V Flip
  • డైమెన్సిటీ 1300 చిప్ తో వస్తోన్న ఫాంటమ్ వీ ఫ్లిప్

TECNO బ్రాండ్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ Tecno Phantom V Fold ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో అనౌన్స్ చేసింది. తర్వాత ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ మడత ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.89,999 గా ఉంది. ఇప్పుడు టెక్నో మరో అడుగు ముందుకేసింది. తాజాగా తన తొలి క్లామ్‌షెల్ స్మార్ట్ ఫోన్ Tecno Phantom V Flip ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని కూడా కంపెనీ వెల్లడించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V Flip లాంచ్ తేదీ

Tecno Phantom V Flip స్మార్ట్ ఫోన్ ని సెప్టెంబర్ 22 వ తేదీన లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్ ఇన్ స్టైల్ అనే ట్యాగ్ లైన్ తో ఈ లాంచ్ ఈవెంట్ ని కంపెనీ నిర్వహించబోతోంది. విడుదల కార్యక్రమం సింగపూర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో ఈ ఫ్లిప్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

Tecno Phantom V Flip స్మార్ట్ ఫోన రీసెంట్ గా గూగుల్ ప్లే కన్సోల్, ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై దర్శనమిచ్చింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి Tecno Phantom V Flip డివైజ్ కి సంబంధించిన లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1.39-ఇంచ్ కవర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటాయి.
  • చిప్సెట్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ ఎంటీ6893జెడ్/సీజెడ్ఏ చిప్ ని వాడనున్నారు. బహుశా మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. ఇకపోతే, గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూని జతచేయనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
  • ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 1165 ఎంఏహెచ్ మరియు 2735ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన డ్యూయల్ బ్యాటరీలు ఉంటాయి. అంటే మొత్తంగా 3,900 ఎంఏహెచ్ సామర్థ్యం ఈ బ్యాటరీల సొంతం. ఈ ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • కనెక్టివిటీ: Tecno Phantom V Flip లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.
Previous article50MP కెమెరా, Snapdragon 480+ చిప్‌తో భారత్‌లో లాంచైన Nokia G42 5G
Next articleGeekbench పై కనిపించిన Samsung Galaxy A25 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.