లీకైన Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G
  • రీసెంట్ గా గీక్‌బెంచ్ పై కనిపించిన డివైజ్
  • తాజాగా లీకైన Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

ప్రముఖ టెక్ కంపెనీ Samsung కొత్త గెలాక్సీ-ఏ సిరీస్ ఫోన్ Galaxy A25 5G పై పని చేస్తున్నట్లు కొన్ని వారాల క్రితం ఓ వార్త బయటకు వచ్చింది. రీసెంట్ గా ఈ ఫోన్ రెండర్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది. దీంతో లుక్ అండ్ డిజైన్ వివరాలు తెలిసాయి. ఇప్పుడు Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A25 5G లో 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో కంపెనీ యొక్క సొంత ఎగ్జినోస్ 1280 చిప్ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్, మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A25 5G లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది మార్కెట్ లో లాంచ్ కానుందని సమాచారం. శాంసంగ్ సంస్థ Samsung Galaxy A25 5G డివైజ్ ని వచ్చే నెలలో లాంచ్ చేస్తుందని టిప్‌స్టర్ ఆంటోని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు డివైజ్ కి సంబంధించి లాంచ్ టైమ్‌లైన్ లేదా లాంచ్ తేదీ ఏదీ రివీల్ కాలేదు. కానీ, అక్టోబర్ లో Samsung Galaxy A25 5G లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు.

Previous articleRealme 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Next article48MP కెమెరా, డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచైన iPhone 15, iPhone 15 Plus
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.