
ప్రపంచం అంతా ఆత్రుతగా ఎదురు చూసిన iPhone 15 సిరీస్ ఫోన్లు నేడు మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఆపిల్ నుంచి వచ్చిన iPhone 15 లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 మరియు iPhone 15 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు 6.1-ఇంచ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ డిస్ప్లేస్ తో వచ్చాయి. సరే, iPhone 15, iPhone 15 Plus ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
iPhone 15 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.
- ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.
- కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
- కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
iPhone 15 Plus స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: iPhone 15 Plus డివైజ్ లో 6.7-ఇంచ్ ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్ అందించారు. ఈ ఫోన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కి మరిన్ని మెరుగులు దిద్దినట్లు ఆపిల్ చెబుతోంది.
- చిప్సెట్: iPhone 15 Plus లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందించనుంది.
- బ్యాటరీ: iPhone 15 Plus లో పవర్ బ్యాకప్ కోసం 4,912 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
- కెమెరా: iPhone 15 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ట్రూడెప్త్ కెమెరా అందించారు.
- కనెక్టివిటీ: iPhone 15 Plus లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.











