
స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Tecno Phantom V Flip ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22 న గ్లోబల్ గా ఈ డివైజ్ విడుదల కానుంది. భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, గ్లోబల్ లాంచ్‌కి ముందు Tecno Phantom V Flip ఫోన్ యొక్క డిజైన్ మరియు ధర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
లీకైన Tecno Phantom V Flip ధర
- MySmartPrice వెబ్సైట్ కథనం ప్రకారం, Tecno Phantom V Flip డివైజ్ 256జిబి స్టోరేజీ వేరియంట్ నైజీరియాలో NGN 5,49,000 (సుమారు రూ.58,773) ధరకి అమ్ముడవుతుందని తెలుస్తోంది.
- రీసెంట్ రిపోర్ట్ ద్వారా, Tecno Phantom V Flip 5G భారత మార్కెట్ లో రూ.50,000 ఉంటుందని తెలిసింది. దేశంలో ఇదే చీపెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ గా నిలవనుంది.
- మరోవైపు, Tecno Phantom V Flip డివైజ్ ని NGN 1,00,000 (సుమారు రూ.10,705) చెల్లించి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని Tecno Mobile Nigeria ప్రకటన చేసింది.
Flipping awesome PHANTOM V Flip Pre-order deal!!
This is a work of art that fits in your pocket.
Deposit N100,000 & get 2 designer perfumes & up to 70GB free MTN data @MTNNG
For more info, scan the QR code.
Ts & Cs apply! #PHANTOMVFlip #FlipYourLifestyle#PerfectinPocket pic.twitter.com/paVzqN5Hsk
— TECNO Mobile Nigeria (@TECNOMobileNG) September 18, 2023
Tecno Phantom V Flip డిజైన్ (అంచనా)
- Tecno Phantom V Flip డివైజ్ డ్యూయల్-కెమెరా సెటప్ తో వస్తున్నట్లు లీకైన వీడియో ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కనిపిస్తోంది.
- కెమెరా మాడ్యూల్ కి పక్కన సెకండరీ డిస్ప్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకైతే, ఫోన్ యొక్క ఇతర డిజైన్ వివరాలు తెలియలేదు.
Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫోల్డబుల్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1.32-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉంటాయి.
- చిప్సెట్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్ ఉంటుంది.
- కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేయనుంది.
- ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip లో వై-ఫై, బ్లూటూత్ 5.3, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.
- కలర్స్: Tecno Phantom V Flip డివైజ్ మినిమల్ బ్లాక్, ఫిల్మ్ వైట్ మరియు పెరివింకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











