
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Edge 40 Neo డివైజ్ ని లాంచ్ చేసింది. Motorola Edge 40 Neo డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. సరే, ఓసారి Motorola Edge 40 Neo డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Motorola Edge 40 Neo డిజైన్
- Motorola Edge 40 Neo డివైజ్ ప్రపంచంలోనే సన్ననైన 5జీ ఫోన్ గా చెప్పబడుతోంది. కేనల్ బే, బ్యూటీ బ్లాక్, సూథింగ్ సీ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ అన్ని కలర్ ఆప్షన్స్ కూడా వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నాయి.
- Motorola Edge 40 Neo లో భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- ఇంకా బ్యాక్ ప్యానెల్ పై 50ఎంపి కెమెరా, ఓఐఎస్ ల బ్రాండింగ్ ఉన్నాయి. ఇకపోతే మోటోరోలా లోగో ఫోన్ కి మధ్యలో ఉంది.
- ఫోన్ ముందు వైపు చూస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఓవరాల్ గా ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
- ఐపీ68 రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. అంటే నీటిలో మునిగినా ఫోన్ కి ఏం కాదు. అయితే పరిమిత సమయానికి మించి నీటిలో ఫోన్ ని ఉంచకూడదు.
Motorola Edge 40 Neo ధర, సేల్ వివరాలు
- Motorola Edge 40 Neo 8జిబి ర్యామ్+128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది.
- 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.25,999 గా నిర్ణయించారు.
- పండుగ ఆఫర్ లో భాగంగా మోటోరోలా ఈ ఫోన్లపై ప్రత్యేక ధరను ఆఫర్ చేస్తోంది.
- దీంతో పరిమిత కాలం పాటు 8జిబి ర్యామ్ వేరియంట్ రూ.20,999 ధరకి మరియు 12జిబి ర్యామ్ వేరియంట్ రూ.22,999 ధరకి లభించనున్నాయి.
- Motorola Edge 40 Neo డివైజ్ ఫ్లిప్కార్ట్, మోటోరోలా.ఇన్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా సెప్టెంబర్ 28 వ తేదీన రాత్రి 7 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది.
- కొనుగోలుదారులు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ రూ.1,000 లేదా ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000 పొందవచ్చు.
Motorola Edge 40 Neo స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Motorola Edge 40 Neo లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 87.70 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పీఓఎల్ఈడీ ప్యానెల్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Motorola Edge 40 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ1 జీపీయూ అందించారు.
- ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 40 Neo లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: Motorola Edge 40 Neo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Motorola Edge 40 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Motorola Edge 40 Neo లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ68 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- ఓఎస్: Motorola Edge 40 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.











