66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 7200 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo T2 Pro 5G

Highlights

  • భారత్ లో లాంచైన Vivo T2 Pro 5G
  • ఐపీ52 రేటింగ్, అమోలెడ్ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • Vivo T2 Pro 5G బేస్ మోడల్ ధర రూ.23,999

Vivo కంపెనీ నేడు భారత్ లో Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo T2 Pro 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వచ్చింది. ఈ సెగ్మెంట్ లో ఇదే అత్యంత వేగవంతమైన ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Vivo T2 Pro 5G డివైజ్ iQOO Z7 Pro కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది.

భారత్ లో Vivo T2 Pro 5G ధర, సేల్ వివరాలు

  • Vivo T2 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.23,999 గా ఉంది. 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.
  • సెప్టెంబర్ 29 వ తేదీన రాత్రి 7 గంటల నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Vivo T2 Pro 5G సేల్ మొదలవుతుంది.
  • యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా రూ.1,000 అదనపు ఎక్స్‌చేంజ్ బోనస్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
  • డిజైన్ విషయానికి వస్తే, Vivo T2 Pro 5G లో గ్లాస్ బ్యాక్, కర్వ్డ్ డిస్ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ న్యూ మూన్ బ్లాక్, డ్యూన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ దీని ధర శ్రేణిలో అత్యంత సన్ననైన ఫోన్ గా పరిగణించబడుతోంది.

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T2 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo T2 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo T2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T2 Pro 5G లో ఐపీ52 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది. ఇంకా ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లను కలిగి ఉంది.
Previous articleరూ.15,000 ధరతో మిడ్-రేంజ్ ఫోన్ లాంచ్ చేయనున్న Micromax
Next article50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y36 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.