లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ

Highlights

  • Galaxy S24 సిరీస్ లో రానున్న 3 మోడల్స్
  • లైనప్ లో వచ్చే మోడల్స్: S24, S24+, S24 Ultra
  • 2024 ఆరంభంలో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ పై పని చేస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Utra. కంపెనీ ప్రకటన రాకముందే, లాంచ్ తేదీకి సంబంధించిన పెద్ద లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సరే, పదండి ఓసారి Samsung Galaxy S24 లైనప్ లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)

  • టిప్‌స్టర్ ఐస్ యూనివర్శ్ Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీని మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేసింది.
  • 2024 లో Samsung Galaxy S24 సిరీస్ డివైజెస్ లాంచ్ అవుతాయని సమాచారం. జనవరి 18 వ తేదీన లాంచ్ ఈవెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Samsung Galaxy S24 సిరీస్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Ultra మోడల్స్ లాంచ్ కానున్నాయి.
  • భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఒకేసారి Samsung Galaxy S24 సిరీస్ ని శాంసంగ్ సంస్థ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టైటానియమ్ చాసిస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 సిరీస్ లోని అల్ట్రా మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ని కలిగి ఉంటుంది. ఇతర మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 చిప్ ఉంటుందని అంచనా.
  • మెమొరీ: Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. మూడు మోడల్స్ లో కూడా 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 అల్ట్రా లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24, Samsung Galaxy S24+ లో 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండవచ్చు. ఇక అన్ని మోడల్స్ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.