3C వెబ్‌సైట్ పై లిస్టైన Xiaomi 14 Pro; రివీలైన డిజైన్!

Highlights

  • నవంబర్ లో లాంచ్ కానున్న Xiaomi 14 సిరీస్
  • లైనప్ లో రానున్న 3 స్మార్ట్‌ఫోన్లు
  • తాజాగా లీకైన Xiaomi 14 Pro ఇమేజ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Xiaomi నవంబర్ నెలలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro, Xiaomi 14 Ultra అనే మూడు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఇంకా షావోమి నుంచి దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Xiaomi 14 Pro 3సీ వెబ్ సైట్ లో లిస్టై కనిపించింది. అంతేకాదు, Xiaomi 14 Pro యొక్క ఇమేజ్ కూడా లీక్ అయ్యింది. సరే, ఓసారి Xiaomi 14 Pro లిస్టింగ్, డిజైన్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Pro 3C లిస్టింగ్

  • 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ప్రకారం, Xiaomi 14 Pro డివైజ్ 23116PN5BC అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.
  • Xiaomi 14 Pro డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • Xiaomi 14 Pro ఫోన్ యొక్క 5జీ కనెక్టివిటీ వివరాలు కూడా రివీల్ అయ్యాయి.

Xiaomi 14 Pro డిజైన్ (లీక్)

  • TechGoing కథనం ద్వారా Xiaomi 14 Pro డివైజ్ యొక్క కేస్ ఇమేజ్ రివీల్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది.
  • ఇమేజ్ ని గమనిస్తే, డివైజ్ ఫ్రంట్ డిస్ప్లే స్పష్టంగా కనిపించడం లేదు. కానీ, పంచ్-హోల్ డిజైన్ అని తెలుస్తోంది.
  • స్పీకర్, ఐఆర్ బ్లాస్టర్ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
  • బాటమ్ లో స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • వాల్యూమ్, పవర్ బటన్స్ ఫోన్ కి కుడివైపున కనిపిస్తున్నాయి.
  • డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై 4 సర్క్యులర్ కెమెరా కటౌట్స్ ఉన్నాయి.
  • ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఈ కటౌట్స్ లో ఉన్నాయి.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Xiaomi 14 Pro లో క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Xiaomi 14 Pro లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీమ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని సమాచారం.
  • కనెక్టివిటీ: Xiaomi 14 Pro లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
Previous articleలీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ
Next articleలాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.