రివీలైన Samsung Galaxy S24 Plus, Galaxy S24 Ultra రెండర్స్

Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • లైనప్ లో రానున్న 3 స్మార్ట్ ఫోన్లు
  • తాజాగా రివీలైన S24 Plus, S24 Ultra డిజైన్

శాంసంగ్ సంస్థ నుంచి తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S24 త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాంగా బేస్ మోడల్ Samsung Galaxy S24 తో పాటు Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra ఉన్నాయి. 2024 ఆరంభంలో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. రీసెంట్ గా బేస్ మోడల్ రెండర్స్ రివీల్ అయ్యాయి. తాజాగా Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra ల యొక్క డిజైన్ రివీల్ అయ్యింది.

Samsung Galaxy S24 Ultra డిజైన్ (లీక్)

  • టిప్‌స్టర్స్ OnLeaks, SmartPrix Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra ల యొక్క రెండర్స్ ని రివీల్ చేశాయి.
  • Samsung Galaxy S24 Ultra డిజైన్ చూస్తే, గత మోడల్స్ Galaxy S23 Ultra, Galaxy S22 Ultra ల మాదిరిగా ఉన్నాయి.
  • Samsung Galaxy S24 Ultra లో బెజెల్స్ సైజ్ తగ్గించారు. ఇంకా ఈ ఫోన్ టైటానియమ్ బిల్డ్ తో వస్తోంది.
  • Samsung Galaxy S24 Ultra లో కాస్త కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. ఇంకా రియర్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

Samsung Galaxy S24 Plus డిజైన్ (లీక్)

  • Samsung Galaxy S24 Plus లో ఫ్లాట్ కార్నర్స్, పిల్ షేప్డ్ యూడబ్ల్యూబీ కటౌట్ ఉన్నాయి.
  • ఫ్రంట్ పంచ్ హోల్ డిజైన్, బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • Samsung Galaxy S24 Plus లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ కార్డ్ ట్రే ఉన్నాయి.
  • లీక్ ప్రకారం, Samsung Galaxy S24 Plus డివైజ్ 158.5 మి.మీ పొడవు, 75.9 మి.మీ వెడల్పు, 7.75 మి.మీ మందం ఉంటుంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.8-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, డబ్ల్యూక్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 2,200 నిట్స్ సన్ లైట్ మోడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy S24 Ultra లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇకపోతే ఇతర రెండు మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీతో వస్తున్నాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 సిరీస్ లోని టాప్ మోడల్ అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 డివైజెస్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఈ ఫోన్లు 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.