Honor 90 పై రూ.11,000 వరకు డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి!

Highlights

  • Honor 90 పై భారీ డిస్కౌంట్
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్
  • అక్టోబర్ 8 నుంచి ఫెస్టివల్ సేల్ ప్రారంభం

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor ఇటీవలె భారతీయ మార్కెట్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. మొదటగా Honor 90 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ ధర రూ.37,999 నుంచి మొదలవుతుంది. Honor 90 రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. అయితే Honor 90 ఫోన్ కొనాలని భావించే వారికి శుభవార్త వచ్చింది. ఈ ఫోన్ పై రూ.11,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Honor 90 ధర, డిస్కౌంట్ ఆఫర్

Honor 90 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది. టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 512జిబి మోడల్ ధర రూ.39,999 గా ఉంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా వీటిపై రూ.11,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. బేస్ వేరియంట్ పై రూ.7,000 డిస్కౌంట్ లభిస్తుండగా, టాప్ మోడల్ పై రూ.6,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఈ రెండు వేరియంట్స్ పై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఆఫర్స్ తర్వాత, Honor 90 8జిబి + 256జిబి మోడల్ రూ.26,999 కి లభిస్తుంది. 12జిబి + 512జిబి మోడల్‌ రూ.29,999 కి లభిస్తుంది. కొనుగోలుదారులు రూ.699 విలువగల 30 వాట్ టైప్-సీ చార్జర్ ని సొంతం చేసుకోవచ్చు.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous articleరూ.9,999 ధరతో భారత్‌లో లాంచైన Oppo A18
Next articleGeekbench పై కనిపించిన Samsung Galaxy A15
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.