
ప్రముఖ టెక్ బ్రాండ్ వివో యొక్క సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా iQOO 12 యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ లీక్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి ఒమ్నివిజన్ ఓవీ50హెచ్ వంటి స్పెసిఫికేషన్స్ తో iQOO 12 మార్కెట్ లోకి వస్తోంది. సరే, ఓసారి iQOO 12 లాంచ్ టైమ్ లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
iQOO 12 ఇండియా లాంచ్ టైమ్‌లైన్
[Exclusive] The iQOO 12 is coming soon to India, and it will be India's first-ever smartphone to launch with the upcoming flagship Snapdragon 8 Gen 3 processor. Expect the launch to happen by November end or in December in India.
Will share more details ASAP.
Meanwhile, feel free…— Mukul Sharma (@stufflistings) October 10, 2023
- ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ సామాజిక మాధ్యమం X లో iQOO 12 యొక్క ఇండియా లాంచ్ టైమ్ లైన్ వివరాలను పంచుకున్నారు. నవంబర్ ఆఖర్లో లేదా డిసెంబర్ ఆరంభంలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
- ఇకపోతే అక్టోబర్ 24 న జరిగే స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ లో క్వాల్కమ్ సంస్థ తన ఫ్లాగ్షిప్ చిప్సెట్ Snapdragon 8 Gen 3 ని లాంచ్ చేయనుంది. అంటే ఆ తర్వాతే iQOO 12 లాంచ్ ఉంటుందని స్పష్టమవుతోంది.
iQOO 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: iQOO 12 లో ఈ7 అమోలెడ్ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ వినియోగించనున్నారు.
- మెమొరీ: iQOO 12 డివైజ్ 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
- సాఫ్ట్‌వేర్: iQOO 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- రియర్ కెమెరా: iQOO 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 64ఎంపి 3x ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: iQOO 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: iQOO 12 డివైజ్ లో 8కే వీడియో రికార్డింగ్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.











