
ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా OnePlus Open యొక్క రెండర్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. రెండర్స్ ద్వారా బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఇకపోతే భారతీయ మార్కెట్ లో OnePlus Open డివైజ్ అక్టోబర్ 19 న లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.
OnePlus Open రెండర్స్ ని Winfuture రివీల్ చేసింది. దీంతో OnePlus Open యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలిసాయి. సరే, ఓసారి OnePlus Open రెండర్స్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
రివీలైన OnePlus Open రెండర్స్
తాజాగా లీకైన OnePlus Open రెండర్స్ ద్వారా బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. వీటిలో బ్లాక్ కలర్ వేరియంట్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తుండగా, గ్రీన్ కలర్ వేరియంట్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. హ్యాండ్సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తున్నట్లు రెండర్స్ ద్వారా తెలుస్తోంది.
OnePlus Open ధర (అంచనా)
OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ధర యూఎస్ మార్కెట్ లో 1,700 డాలర్లు (సుమారు రూ.1,41,500) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తుందని సమాచారం. సరే, ఓసారి OnePlus Open డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7.8-ఇంచ్ కవర్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
- మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
- సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: OnePlus Open లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో 3X జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి/20ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
- కనెక్టివిటీ: OnePlus Open లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.











