64MP పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న OnePlus 12; లీకైన కెమెరా స్పెసిఫికేషన్స్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus 12
  • మరోసారి లీకైన కెమెరా స్పెసిఫికేషన్స్
  • 64ఎంపి పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ OnePlus 12 ని లాంచ్ చేయనుంది. తాజాగా OnePlus 12 డివైజ్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను లీక్ చేసింది. దీంతో OnePlus 12 డివైజ్ 64ఎంపి పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నట్లు తెలిసింది. గత మోడల్ OnePlus 11 కి సక్సెసర్ గా OnePlus 12 డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. సరే, ఓసారి OnePlus 12 లీక్ విశేషాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

లీకైన OnePlus 12 కెమెరా స్పెసిఫికేషన్స్

  • త్వరలో లాంచ్ కాబోవు OnePlus 12 డివైజ్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.
  • చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. దాని ప్రకారం, OnePlus 12 డివైజ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్966 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ లెన్స్ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • పెరిస్కోప్ లెన్స్ ఓఐఎస్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇప్పుడు OnePlus 12 యొక్క లాంచ్ సమాచారం తెలుసుకుందాం.

OnePlus 12 లాంచ్ (అంచనా)

  • OnePlus 12 డివైజ్ చైనాలో 2023 డిసెంబర్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
  • గ్లోబల్ మార్కెట్స్ లో 2024 జనవరి నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • OnePlus 12 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రాబోతోంది. సరే, ఓసారి OnePlus 12 యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, క్యూహెచ్డీ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: OnePlus 12 డివైజ్ 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ ఓఐఎస్ లెన్స్, 48ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus 12 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలర్ట్ స్లైడర్, ఐపీ68 రేటింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.