
Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలోనే POCO C65 డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ ఇండోనేషియాకు చెందిన TKDN సర్టిఫికేషన్ పొందింది. తాజాగా POCO C65 డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. POCO C65 డివైజ్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని Xiaomiui ఒక కథనాన్ని ప్రచురించింది. సరే, ఓసారి ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న POCO C65
రాబోయే POCO C65కి “air (గాలి)” అనే సంకేతనామం ఉందని, హ్యాండ్‌సెట్‌ను అంతర్గతంగా “C3V” అని పిలుస్తారని నివేదిక పేర్కొంది. రాబోయే POCO C65 అలాగే Redmi 13C కూడా ఇండోనేషియా యొక్క TKDN ధృవీకరణను పొందాయి. POCO C65, Redmi 13C యొక్క రీబ్రాండ్ అని పరిగణనలోకి తీసుకుంటే, ఇది 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. POCO C55లో కనిపించే విధంగా మైక్రో-USB పోర్ట్‌కి బదులుగా ఈ స్మార్ట్‌ఫోన్ USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం రాబోయే Redmi 13C అలాగే POCO C65 స్మార్ట్‌ఫోన్‌ల ఇతర స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియవు. రోజులు గడిచేకొద్దీ మేము ఈ డివైజెస్ గురించి మరింత సమాచారాన్ని మీకు అందిస్తాం.
అయితే Redmi 13C ఇంకా లాంచ్ కాలేదు. ఈ ఫోన్ చైనాలో త్వరలోనే లాంచ్ అవ్వనుంది. ఇదే డివైజ్ ని ఇతర మార్కెట్స్ లో POCO C65 పేరుతో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. Redmi 12C కి సక్సెసర్ గా Redmi 13C మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి మనం Redmi 12C స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Redmi 12C స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi 12C డివైజ్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 6జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది. - ఓఎస్: Redmi 12C డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi 12C డివైజ్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.











