దసరాకి ముందే మొదలుకానున్న Vivo Y200 5G సేల్; లాంచ్‌కి ముందు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200 5G
  • ఆఫ్‌లైన్ మార్కెట్ లో అక్టోబర్ 3వ వారం నుంచి సేల్
  • డెజర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఓ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y200 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. వివో లవర్స్ ఈ డివైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా 91మొబైల్స్ కి రిటైల్ వర్గాల నుంచి Vivo Y200 5G సేల్ తేదీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G లాంచ్ మరియు సేల్ వివరాలు

  • 91mobiles కి రిటైల్ వర్గాల నుంచి Vivo Y200 5G సేల్ కి సంబంధించిన సమాచారం అందింది. దాని ప్రకారం, Vivo Y200 5G డివైజ్ అక్టోబర్ 3 వ వారంలో భారత్ లో సేల్ కి వస్తుందని తెలుస్తోంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ దసరా పండుగకి ముందే మొదలు కానుందని సమాచారం. అక్టోబర్ 22 లేదా అక్టోబర్ 23 న ఫోన్ సేల్ ఉంటుందని భావిస్తున్నారు.
  • ఈ ఫోన్ ప్రధానంగా ఆఫ్‌లైన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు. రిటైల్ స్టోర్స్ లో కొనుగోలుకి ఈ డివైజ్ అందుబాటులో ఉంటుంది.
  • అలాగే, Vivo Y200 5G డివైజ్ ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా కూడా కొనవచ్చు.
  • 91మొబైల్స్ కి అందిన సమాచారం ప్రకారం, Vivo Y200 5G డివైజ్ డెజర్ట్ గోల్డ్ మరియు జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్ (రిటైల్ సోర్స్)

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడానున్నారు.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.