లాంచ్‌కి ముందు లీకైన OnePlus Open ఇండియా ధర, సేల్ తేదీ!

Highlights

  • అక్టోబర్ 19 న లాంచ్ అవుతోన్న OnePlus Open
  • అక్టోబర్ 27 న OnePlus Open సేల్
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న ఫోన్

OnePlus Open భారతీయ మార్కెట్ ధర మరోసారి లీక్ అయ్యింది. అలాగే సేల్ తేదీ కూడా రివీల్ అయ్యింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ భారత్ లో అక్టోబర్ 19 న లాంచ్ కానుంది. లాంచ్ తర్వాత వారం రోజులకు మొదటి సేల్ ఉంటుందని సమాచారం. కొన్ని లీక్స్ OnePlus Open ని గోల్డ్ కలర్ ఆప్షన్ ని రివీల్ చేసింది. OnePlus Open డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, అలర్ట్ స్లైడర్ తో వస్తోంది. సరే, ఓసారి OnePlus Open లీకైన ధర, సేల్ తేదీ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో OnePlus Open ధర, సేల్ తేదీ (అంచనా)

  • ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, OnePlus Open ధర భారత్ లో రూ.1,39,999 గా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు, యూఎస్ మార్కెట్ ధర సుమారు 1,700 డాలర్లు (దాదాపు రూ.1,41,300) గా ఉండనుంది. ఈ రెండు మార్కెట్స్ ధరలు Samsung Galaxy Z Fold 5 (12GB+256GB) ధర (రూ.1,54,999)కి దగ్గరగా ఉన్నాయి.
  • OnePlus Open కాస్త సరసమైన ధరకే లభించనుందని ఆశలు పెట్టుకున్న వారికి తాజాగా లీకైన ధరలు నిరాశపరిచేవేనని చెప్పాలి. గతంలో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,00,000 నుంచి రూ.1,20,000 మధ్య ఉంటుందని వార్తలు వచ్చాయి.
  • OnePlus Open భారత్ లో అక్టోబర్ 27 వ తేదీన సేల్ కి వస్తుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. అంటే అక్టోబర్ 19 న లాంచ్ ఈవెంట్ తర్వాత దాదాపు ఒక వారం రోజుల తర్వాత సేల్ ఉండనుంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7.8-ఇంచ్ కవర్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus Open లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో 3X జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి/20ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
  • కనెక్టివిటీ: OnePlus Open లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.