కంపెనీ అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Samsung Galaxy A05s; పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • అక్టోబర్ 18 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A05s
  • అఫీషియల్ వెబ్ సైట్ లో లిస్టైన డివైజ్
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అక్టోబర్ 18 న భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు కంపెనీ Samsung Galaxy A05s డివైజ్ ని తన అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ చేసింది. దీంతో పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A05s డివైజ్ 50ఎంపి కెమెరా, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A05s డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్, సేల్ తేదీ, కలర్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16మిలియన్ కలర్ డెప్త్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. ఇది 2.4గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల 6ఎన్ఎమ్ ప్రాసెసర్.
  • ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కి రెండేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని హామీనిస్తోంది.
  • మెమొరీ: Samsung Galaxy A05s ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 12జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది. 4జిబి ర్యామ్ వేరియంట్ కూడా లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.1, వై-ఫై 5Ghz, వై-ఫై డైరెక్ట్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05s లో డాల్బీ అట్మాస్ స్పీకర్స్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Samsung Galaxy A05s ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A05s ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ 18 వ తేదీన ధర ప్రకటించబడుతుంది. లైట్ వయొలెట్, లైట్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా Samsung Galaxy A05s ని కొనుగోలు చేయవచ్చు.