రివీలైన OPPO A2m డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A2m
  • 12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • తాజాగా రివీలైన OPPO A2m డిజైన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఏ-సిరీస్ ని మరింత విస్తరిస్తోంది. త్వరలోనే ఈ కంపెనీ నుంచి OPPO A2m డివైజ్ చైనా మార్కెట్ లో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. చైనా టెలీకామ్ వెబ్‌సైట్ ద్వారా OPPO A2m ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్, ధర రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO A2m డిజైన్ (లిస్టింగ్)

  • చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో కనిపించిన ఇమేజ్ ప్రకారం, ఈ కొత్త ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది.
  • ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సింగిల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున చూస్తే, పవర్ బటన్ ఉంటుంది. ఇక వాల్యూమ్ బటన్ ఎడమవైపున ఉంది. డివైజ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో కనిపించింది.

OPPO A2m స్పెసిఫికేషన్స్ (లిస్టింగ్)

  • డిస్ప్లే: OPPO A2m లో హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ప్రాసెసర్: OPPO A2m లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ఉండే ఉంటుంది. ఇదొక ఆక్టా-కోర్ చిప్. ఈ ఫోన్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో కూడా రావొచ్చని మరొక వార్త ద్వారా తెలుస్తోంది.
  • మెమొరీ: OPPO A2m డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OPPO A2m లో 13ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: OPPO A2m డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A2m లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

OPPO A2m ధర (లిస్టింగ్)

  • OPPO A2m ఫోన్ మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1499 (సుమారు రూ.17,100) ఉంటుంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1799 (సుమారు రూ.20,700) ఉంటుంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర CNY 2199 (సుమారు రూ.25,300) ఉంటుంది.
Previous articleLava Blaze 2 5G డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ
Next articleSnapdragon 4 Gen 1 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo Y200 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.