
స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా త్వరలో Lava Blaze 2 5G ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లావా సంస్థ Lava Blaze 2 5G డివైజ్ ని టీజ్ చేసింది. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో Lava Blaze 2 5G వస్తున్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. ఇదివరకు Blaze 2 సిరీస్ లో రెండు ఫోన్లు రాగా Lava Blaze 2 5G ఫోన్ మూడవది. సరే, ఓసారి Lava Blaze 2 5G టీజర్ విశేషాలు, డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Lava Blaze 2 5G డిజైన్‌ని టీజ్ చేసిన కంపెనీ
Things are about to get really exciting. Are you ready?#LordOf5G #Blaze25G #LavaMobiles #ProudlyIndian #ComingSoon pic.twitter.com/9YX6SUhVZ4
— Lava Mobiles (@LavaMobile) October 21, 2023
- Lava Blaze 2 5G ఇండియా లాంచ్ యొక్క మొదటి టీజర్ ని లావా సంస్థ సోషల్ మీడియా చానల్స్ లో షేర్ చేసింది.
- అయితే కంపెనీ తన టీజర్ ద్వారా Lava Blaze 2 5G లాంచ్ తేదీని వెల్లడించలేదు. కానీ, టీజర్ ద్వారా ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ గ్లిమ్స్ బయటకు వచ్చింది.
- Lava Blaze 2 5G టీజర్ ని గమనిస్తే, డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది.
- కెమెరా మాడ్యూల్ డిజైన్ తప్పా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు. త్వరలోనే డివైజ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చే అవకాశం ఉంది.
Lava Blaze 2 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- ప్రాసెసర్: Lava Blaze 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
- మెమొరీ: Lava Blaze 2 5G లో 4జిబి/6జిబి ర్యామ్, 4జిబి/6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Lava Blaze 2 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
- చార్జింగ్: Lava Blaze 2 5G లో 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటుందని సమాచారం. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది.
- ఆడియో: Lava Blaze 2 5G లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది.
- కనెక్టివిటీ: Lava Blaze 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి.











