
న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (IMC)లో రిలయన్స్ జియో తన JioPhone Prima 4G ని ప్రదర్శించింది. ఈ ఫీచర్ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఇంకా WhatsApp, YouTube మరియు అనేక సోషల్ మీడియా యాప్స్ సపోర్ట్ తో వస్తోంది. ఈ డివైజ్ కంపెనీ యొక్క స్వంత ఇ-రిటైల్ వెబ్‌సైట్, JioMartలో ఈ ఫోన్ ని కొనుగోలు చేసే వారి కోసం కొన్ని ఆఫర్‌లతో పాటుగా జాబితా చేయబడింది.
JioPhone Prima 4G ఫీచర్ ఫోన్ దీపావళి నాటికి భారతదేశంలో అధికారికంగా లాంచ్ అవుతుందని IMC వద్ద రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఫోన్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉందని JioMart ఇప్పటికే చూపిస్తోంది. JioPhone Prima 4G రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. JioPhone Prima 4G ధర మరియు లభ్యతతో పాటు దాని స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లను తెలుసుకుందాం పదండి.
JioPhone Prima 4G ధర, లభ్యత
JioPhone Prima 4G JioMartలో రూ. 2,599 ధరతో లిస్ట్ చేయబడింది. బ్లూ మరియు ఎల్లో కలర్ వేరియంట్లలో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో దీపావళి సందర్భంగా ఫోన్ అధికారికంగా లాంచ్ అవుతుందని చెప్పబడినప్పటికీ, ఇది ఇప్పటికే JioMart లో అమ్మకానికి లిస్ట్ చేయబడింది. లాంచ్ ఆఫర్‌లలో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు మరియు కూపన్‌లు ఉన్నాయి.
JioPhone Prima 4G స్పెసిఫికేషన్స్
- బ్యాటరీ: JioPhone Prima 4G లో పవర్ బ్యాకప్ కోసం 1800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
- డిస్ప్లే: JioPhone Prima 4G లో టీఎఫ్‌టీ 320*240 పిక్సెల్స్ రెజుల్యూషన్ డిస్ప్లే ఉంది.
- ప్రాసెసర్: JioPhone Prima 4G లో ఏఆర్ఎమ్ కార్టెక్స్ ఏ53 చిప్ వాడారు.
- మెమొరీ: 128జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.
- కెమెరా: JioPhone Prima 4G లో 0.3 ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. రియర్ కెమెరా వివరాలు ఇంకా తెలియాలి. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ కానున్నాయి.











