6.72-ఇంచ్ 90Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన OPPO A2 5G

Highlights

  • డైమెన్సిటీ 6020 చిప్ తో వచ్చిన OPPO A2 5G
  • OPPO A2 5G డివైజ్ ధర CNY 1699 (రూ.19,700)
  • కలర్స్: బ్లాక్, గ్రీన్, వయొలెట్

OPPO A2 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఒప్పో నుంచి ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త డివైజ్ ఇది. ఈ కొత్త ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ ఆక్టా-కోర్ చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వచ్చింది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A2 5G డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A2 5G ధర, లభ్యత

OPPO A2 5G స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గ్రీన్, వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. OPPO A2 5G డివైజ్ బేస్ మోడల్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధర CNY 1699 (సుమారు రూ.19,700) గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1799 (సుమారు రూ.20,500) గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 6 నుంచి చైనాలో సేల్ కి రానుంది.

OPPO A2 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A2 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: OPPO A2 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO A2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO A2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO A2 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO A2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: OPPO A2 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్, స్టీరియో స్పీకర్ ఉన్నాయి.