లాంచ్‌కి ముందు లీకైన Vivo X100 స్పెసిఫికేషన్స్, ధర

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo X100
  • జీస్ ట్యూన్డ్ ఆప్టిక్స్ తో వస్తోన్న డివైజ్
  • Vivo X100 ధర CNY 3,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ చైనాలో నవంబర్ 13 న లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Vivo X100 డివైజ్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ని 91మొబైల్స్ సేకరించింది. ఇకపోతే Vivo X100 ఫోన్ చైనాలో లాంచ్ అయ్యాక, భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Vivo X100 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo X100 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo X100 లో 6.78-ఇంచ్ 1.5కే (2800*1260పిక్సెల్స్) డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Vivo X100 లో ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Vivo X100 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ ఓఐఎస్ లెన్స్, 64ఎంపి పెరిస్కోప్ ఓఐఎస్ కెమెరా, లేజర్ ఫోకస్ సిస్టమ్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo X100 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, ఐఆర్ సెన్సర్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ ఉంటాయి.

Vivo X100 లో భారతదేశానికి చెందిన NavIC సిస్టమ్ కంపాటిబులిటీని గుర్తించడమైంది. దీంతో త్వరలోనే భారత్ లో Vivo X100 లాంచ్ కానుందని అర్థమవుతోంది. భారతదేశానికి చెందిన నావిక్ శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ తొలుత iPhone 15 సిరీస్ లో పరిచయం చేశారు.

చైనాలో Vivo X100 ధర (అంచనా)

  • Vivo X100 స్మార్ట్‌ఫోన్ ధర చైనాలో CNY 3,999 (సుమారు రూ.45,500) గా ఉంటుందని సమాచారం. అంటే గత మోడల్ Vivo X90 కంటే CNY 100 ఎక్కువ ధరతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Vivo X100 డివైజ్ బ్లాక్, బ్లూ, వైట్, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo X100 ఫోన్ 12జిబి/256జిబి, 16జిబి/256జిబి, 16జిబి/512జిబి, 16జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.