
షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే అవసరమైన సర్టిఫికేషన్స్ పొందిన ఈ డివైజ్ ని రెడ్మీ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్ పై టీజ్ చేసింది. Xiaomi Nigeria తన X ఖాతాలో Redmi 13C టీజర్ ని షేర్ చేసింది. “Redmi 13C వచ్చేస్తోంది…” అంటూ రెడ్మీ తన పోస్ట్ లో పేర్కొంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు Redmi 13C ఇండియా లాంచ్ వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు.
తన పోస్ట్ లో షావోమి నైజీరియా Redmi 13C యొక్క రెండర్ ఇమేజెస్ ని షేర్ చేసింది. దీంతో ఫోన్ డిజైన్ పూర్తిగా రివీల్ అయ్యింది. ఇక మరొక లీక్ ద్వారా Redmi 13C ధర, రెండర్స్ బయటకు వచ్చాయి. Appuals ద్వారా ఈ విషయాలు తెలిసాయి.
Redmi 13C టీజర్ విశేషాలు
- Redmi 13C టీజర్ పోస్టర్ ద్వారా గ్రీన్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి.
- Redmi 13C లో వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంది. ఇంకా ఫ్లాట్ ఎడ్జెస్, మందపాటి చిన్ కనిపిస్తున్నాయి.
- లీకైన హ్యాండ్సాన్ ఇమేజెస్ ద్వారా Redmi 13C లో రెండు సర్క్యులర్ రింగ్స్ లో కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది.
- రెడ్మీ బ్రాండ్ ఇంకా Redmi 13C లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ప్రకటన వస్తుందని మేం భావిస్తున్నాం.
If you guessed Redmi 13C on the riddle challenge, then you are right! ?
? The Redmi 13C is coming, and it's bringing more colors, a fresh style, stronger and more stable performance, a larger and smoother screen, plus cameras that guarantee greater accuracy and a clearer view!… pic.twitter.com/1d3Qjwx8Ho
— Xiaomi Nigeria (@XiaomiNigeria) November 3, 2023
Redmi 13C ధర (అంచనా)
- Redmi 13C డివైజ్ 4జిబి + 128జిబి వేరియంట్ ధర 130 యూరోలు (సుమారు రూ.11,600) గా ఉండే అవకాశం ఉంది.
- మరోవైపు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 150 యూరోలు (సుమారు రూ.13,400) గా ఉంటుందని సమాచారం.
Redmi 13C 4G, Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
- ఓఎస్: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ప్రాసెసర్: Redmi 13C 4G వర్షన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉండే అవకాశం ఉంది. 5జీ మోడల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ ఉండవచ్చు.
- మెమొరీ: Redmi 13C డివైజ్ 4జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.
- కెమెరా: Redmi 13C లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
- బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











