5,000mAh బ్యాటరీ, Helio G85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO C65

Highlights

  • నవంబర్ 5 న గ్లోబల్‌గా లాంచైన POCO C65
  • 8జిబి ర్యామ్ తో వచ్చిన POCO C65
  • POCO C65 ప్రారంభ ధర 129 డాలర్లు (సుమారు రూ.10,700)

Xiaomi సబ్-బ్రాండ్ POCO గ్లోబల్ గా ఒక కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. POCO C65 పేరుతో వచ్చిన ఈ డివైజ్ చక్కటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, అత్యధిక ర్యామ్, స్టోరేజీ తో POCO C65 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం POCO C65 డివైజ్ యూఎస్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

POCO C65 ధర, ఆఫర్, కలర్ ఆప్షన్స్

  • POCO C65 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • 6జిబి ర్యామ్ మోడల్ ధరను 129 డాలర్లు (సుమారు రూ.10,700) గా నిర్ణయించారు. ఇక 8జిబి ర్యామ్ వేరియంట్ ధర 149 డాలర్లు (సుమారు రూ.12,400) గా ఉంది.
  • ఎర్లీ బర్డ్ ఆఫర్ లో భాగంగా 6జిబి వేరియంట్ 109 డాలర్లు (సుమారు రూ.9,100), 8జిబి ర్యామ్ మోడల్ 129 డాలర్లు (సుమారు రూ.10,700) కి లభించనున్నాయి.
  • POCO C65 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

POCO C65 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ (1,600*720 పిక్సెల్స్) స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20.6:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: POCO C65 డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: POCO C65 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: POCO C65 డివైజ్ 168మి.మీ పొడవు, 78 మి.మీ వెడల్పు, 8.09 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.
Previous articleCroma లో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి!
Next articleRedmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.