
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A25 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ లాంచ్ వివరాలు ఇంకా తెలియలేదు. అయితే ఈలోపు నెట్టింట్లో Samsung Galaxy A25 5G యొక్క రెండర్ ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క లుక్ మరియు డిజైన్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి Samsung Galaxy A25 5G కి సంబంధించి లీకైన ఫోటో వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A25 5G డిజైన్
- Samsung Galaxy A25 5G ఫ్రంట్ ప్యానెల్ చూస్తే ఫ్లాట్ స్క్రీన్ ఉంది. ఇంకా యు షేప్డ్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ స్క్రీన్ కి మూడు వైపులా సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి.
- బ్యాక్ ప్యానెల్ పూర్తిగా ఫ్లాట్ గా ఉంది. దీనిపై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఈ కెమెరా మాడ్యూల్ ఫోన్ కి కుడివైపున ఉంది. 3 కెమెరా రింగ్స్ నిలువుగా ఉన్నాయి. ఫ్లాష్ లైట్ ఈ సెన్సర్స్ కి పక్కన ఉంది. బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ ఉంది.
- Samsung Galaxy A25 5G డివైజ్ కి సైడ్ ఫ్రేమ్ కి కుడివైపున వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇక ఫోన్ ఫ్రేమ్ కి ఎడమ వైపున సిమ్ స్లాట్ ఉంది. బ్లాక్, లైట్ బ్లూ, లైమ్ గ్రీన్, బ్లూ-గ్రే వంటి కలర్ ఆప్షన్స్ లో Samsung Galaxy A25 5G కనిపించింది.
- Samsung Galaxy A25 5G డివైజ్ 162 మి.మీ పొడవు, 77.5 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం ఉంటుంది.
Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Samsung Galaxy A25 5G లో 6.44-ఇంచ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: Samsung Galaxy A25 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.
- కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంటుంది. ఇతర సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు.
- బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











