
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అప్పుడప్పుడు తన డివైజెస్ యొక్క స్పెషల్ ఎడిషన్స్ ని లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈసారి Samsung Galaxy S23 FE స్పెషల్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. స్పెషల్ ఎడిషన్ లో భాగంగా రెండు కొత్త కలర్స్ ని విడుదల చేసింది. అవి: ఇండిగో మరియు ట్యాంజరిన్. స్టాండర్డ్ వర్షన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఈ స్పెషల్ ఎడిషన్ లోనూ ఉన్నాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదు. కొత్తగా పరిచయమైన కలర్ వేరియంట్స్ కొనదలిచిన వారు శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మరింత సమాచారం తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S23 FE స్పెషల్ ఎడిషన్ ధర, లభ్యత
- కొత్తగా విడుదలైన Samsung Galaxy S23 FE ట్యాంజరిన్ మరియు Samsung Galaxy S23 FE ఇండిగో మోడల్స్ ని శాంసంగ్.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- Samsung Galaxy S23 FE 8జిబి+128జిబి మోడల్ ధర రూ.59,999 గా ఉంది. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.64,999 గా ఉంది. ఇవే ధరల్లో ఇతర కలర్ ఆప్షన్స్ అమెజాన్ మరియు ఇతర ఔట్‌లెట్స్ లో అందుబాటులో ఉన్నాయి.
- అయితే శాంసంగ్ అఫీషియల్ వెబ్‌సైట్ పైన కస్టమర్లు Fab Grab Offer పొందవచ్చు. దీంతో రూ.10,000 బ్యాంక్ డిస్కౌంట్ పై.. స్పెషల్ ఎడిషన్ 8జిబి వేరియంట్ ని రూ.49,999 ధరకి, 12జిబి వేరియంట్ ని రూ.54,999 కి సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ పొందాలంటే, కస్టమర్లు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ మరియు క్రెడిట్ కార్డ్ ఫుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది.
- మీరు గనుక శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే శాంసంగ్ షాప్ యాప్ పై రూ.2,000 వరకు డిస్కౌంట్, ఇంకా మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తులు కలిపి కొంటే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా శాంసంగ్ కేర్+ పై 5 శాతం డిస్కౌంట్, పేటీఎమ్ వ్యాలెట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్, బజాజ్ ఈఎంఐ కార్డ్ వాడితే రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తాయి.
Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్
కలర్స్ తప్పితే, మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ స్టాండర్డ్ Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ మాదిరే ఉంటాయి.
- డిస్ప్లే: Samsung Galaxy S23 FE 5G లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy S23 FE 5G లో ఎగ్జినోస్ 2200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Xclipse 920 GPU వినియోగించారు. అమెరికా, కెనెడా దేశాల్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్, అడ్రెనో 730 జీపీయూ తో ఫోన్ లాంచ్ అయ్యింది.
- మెమొరీ: Samsung Galaxy S23 FE 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S23 FE 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.
- కెమెరా: Samsung Galaxy S23 FE 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy S23 FE 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- భద్రత: Samsung Galaxy S23 FE 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
- ఆడియో: Samsung Galaxy S23 FE 5G లో స్టీరియో స్పీకర్, డాల్బి అట్మాస్ ఆడియో, టై-సీ ఆడియో పోర్ట్ ఉన్నాయి.
- చుట్టుకొలత, బరువు: Samsung Galaxy S23 FE 5G డివైజ్ 157.9 మి.మీ పొడవు, 76.5 మి.మీ వెడల్పు, 8.1 మి.మీ మందం, 209 గ్రాముల ఉంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE 5G లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
- కనెక్టివిటీ: Samsung Galaxy S23 FE 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Samsung Galaxy S23 FE 5G డివైజ్ మింట్, క్రీమ్, గ్రాఫైట్, పర్పుల్ ఇండిగో, ట్యాంజరిన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











