
Honor 90 స్మార్ట్‌ఫోన్ తో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Honor సంస్థ త్వరలో Honor 100 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ Honor 100 లాంచ్ ప్రకటన చేయలేదు. ఈలోపు Honor కి సంబంధించిన డివైజెస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఆ లిస్టింగ్ Honor 100 సిరీస్ ఫోన్లకు సంబంధించినదేనని అంచనా వేస్తున్నారు. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Honor 100 సిరీస్ 3సీ సర్టిఫికేషన్ (అంచనా)
- కొత్త Honor డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. ఇది MAA-AN10 మరియు MAA-AN00 అనే మోడల్ నంబర్స్ కలిగి ఉంది.
- ఈ మోడల్ నంబర్ గల మొబైల్స్ Honor 100 సిరీస్ కి సంబంధించినవేనని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
- ఇకవేళ, ఇది నిజమే అయితే Honor 100 సిరీస్ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఎంట్రీ ఇవ్వనుంది.
- ఈ హానర్ ఫోన్లు 5జీ సపోర్ట్ కలిగి ఉన్నట్లు 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- ఈ వివరాలు తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ 3సీ సర్టిఫికేషన్ ద్వారా వెల్లడి కాలేదు.
Honor 100 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- లేటెస్ట్ లీక్ ప్రకారం, Honor 100 స్మార్ట్‌ఫోన్ 1.5కే డిస్ప్లే, హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 200ఎంపి ప్రైమరీ కెమెరా తో వస్తున్నట్లు సమాచారం.
- సరే, ఓసారి ఇప్పటికే లాంచైన Honor 90 డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Honor 90 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
- కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
- కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.












