
Infinix సంస్థ తక్కువ బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. Infinix Smart 8 పేరుతో ఈ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయ్యింది. Infinix Smart 8 డివైజ్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి ర్యామ్ పవర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఐఫోన్ లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ లాంటి మ్యాజిక్ రింగ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Infinix Smart 8 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Infinix Smart 8 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Infinix Smart 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, 90 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, మ్యాజిక్ రింగ్ ఫీచర్ ఉన్నాయి. మ్యాజిక్ రింగ్ ఫీచర్ ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవచ్చు.
- చిప్సెట్: Infinix Smart 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్ వాడారు. ఎంట్రీ లెవెల్ ఫోన్స్ లో ఈ చిప్సెట్ ఎక్కువగా కనిపిస్తుంది. దీని పెర్ఫామెన్స్ కూడా పర్వాలేదు.
- మెమొరీ: Infinix Smart 8 లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి మొత్తం 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: Infinix Smart 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సపోర్ట్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.
- ఓఎస్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Infinix Smart 8 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Infinix Smart 8 ధర
- Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్ నైజీరియాలో సింగిల్ స్టోరేజీతో అఫీషియల్ వెబ్‌సైట్ పై లిస్టైంది.
- 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను NGN 82,000 (సుమారు రూ.8,700) గా నిర్ణయించారు.
- Infinix Smart 8 మొబైల్ టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్, క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











