
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో ఇప్పటి వరకు చాలా ఫోన్లను లాంచ్ చేసింది. ఇంకా ఆ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా మరొక కొత్త వై-సిరీస్ ఫోన్ Vivo Y79+ 5G గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై ప్రత్యక్షమైంది. PD2313 అనే మోడల్ నంబర్ తో ఈ డివైజ్ లిస్టైంది. వివో రీసెంట్ గా చైనా మార్కెట్ లో Vivo Y100 ని లాంచ్ చేసింది. Vivo Y79+ 5G డివైజ్ Vivo Y100 కి రీబ్రాండ్ వర్షన్ అని టాక్ వినిపిస్తోంది.
Vivo Y79+ 5G గూగుల్ ప్లే లిస్టింగ్ వివరాలు
- Vivo Y79+ 5G డివైజ్ గూగుల్ ప్లే లిస్టింగ్ పై V2313 అనే మోడల్ నంబర్ తో లిస్టైంది. Vivo Y100 5G చైనీస్ వేరియంట్ కూడా ఇదే మోడల్ నంబర్ కలిగి ఉంది. దీంతో Vivo Y79+ 5G డివైజ్ Vivo Y100 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని అంచనా వేస్తున్నారు.
- గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Vivo Y79+ 5G డివైజ్ 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్ స్క్రీన్, 480పీపీఐ పిక్సెల్ డెన్సిటీ తో లిస్టైంది.
- Vivo Y79+ 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎమ్6375 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Vivo Y79+ 5G లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వినియోగించినట్లు లిస్ట్ లో ఉంది.
- Vivo Y79+ 5G లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. Vivo Y100 5G చైనీస్ వేరియంట్ లో కూడా ఇదే చిప్సెట్ వాడారు.
- Vivo Y79+ 5G 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.
- గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా పైన తెలిపిన విషయాలు తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు.












