50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Redmi 13C

Highlights

  • నైజీరియాలో లాంచైన Redmi 13C
  • హీలియో జీ99 చిప్సెట్‌తో వచ్చిన డివైజ్
  • Redmi 13C ధర NGN 1,08,100 (సుమారు రూ.10,100)

షావోమి సబ్-బ్రాండ్ Redmi గ్లోబల్ గా Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసింది. నైజీరియాలో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో ఈ డివైజ్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Redmi 13C డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi 13C ధర

Redmi 13C స్మార్ట్‌ఫోన్ నైజీరియన్ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ మోడల్ ధరను NGN 98,100 (సుమారు రూ.10,100) గా నిర్ణయించారు. Redmi 13C 8జిబి ర్యామ్ వేరియంట్ ధర NGN 1,08,100 (సుమారు రూ.11,100) గా ఉంది. Redmi 13C ఫోన్ బ్లాక్ మరియు క్లవర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Redmi 13C స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. ఇది 9 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • మెమొరీ: Redmi 13C డివైజ్ 4జిబి, 6జిబి, 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో నైజీరియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 4జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C లో డ్యూయల్ సిమ్, 4జీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. Redmi 13C డివైజ్ 8.09 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.
Previous article8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8
Next articleGoogle Play Console పై లిస్టైన Vivo Y79+ 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.