లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25
  • ఎగ్జినోస్ 1280 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • Samsung Galaxy A25 ధర 300 యూరోలు (రూ.26,900)

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే Samsung Galaxy A25 డివైజ్ ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ డివైజ్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నేడు Samsung Galaxy A25 కి సంబంధించి ఒక కొత్త నివేదిక బయటకు వచ్చింది. దీని ద్వారా Samsung Galaxy A25 గ్లోబల్ ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A25 యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 ధర (లీక్)

  • లీక్ ప్రకారం, Samsung Galaxy A25 డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 300 యూరోలు (సుమారు రూ.26,900) గా ఉంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 400 యూరోలు (సుమారు రూ.34,900) గా ఉంది.
  • ఈ ధరలు గ్లోబల్ మార్కెట్‌కి చెందినవని గమనించాలి. భారతీయ మార్కెట్ ధర కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A25 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A25 లో 6.5-ఇంచ్ డిస్ప్లే, యూ-షేప్డ్ వాటర్‌డ్రాప్ నాచ్, ఫుల్ హెచ్డీ+ పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ఓఎస్: Samsung Galaxy A25 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. అయితే లేటెస్ట్ లీక్ ప్రకారం, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ డివైజ్ వస్తున్నట్లు తెలుస్తోంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉంటుంది. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Samsung Galaxy A25 డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A25 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.