
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే Samsung Galaxy A15 5G. ఇటీవలె ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ధర, స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు కొత్త లీక్ ద్వారా Samsung Galaxy A15 5G రెండర్స్ రివీల్ అయ్యాయి. దాంతో, ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
లీకైన Samsung Galaxy A15 5G రెండర్స్
- ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని, Newzonly సౌజన్యంతో Samsung Galaxy A15 5G యొక్క రెండర్స్ ని షేర్ చేశారు.
- రెండర్స్ ని గమనిస్తే, Samsung Galaxy A15 5G వెనుక భాగం, సైడ్ ప్యానెల్ ఎలా ఉంటుందో తెలుస్తోంది.
- Samsung Galaxy A15 5G ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి ఉంది. పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
- Samsung Galaxy A15 5G లో ముందు వైపు నాచ్ డిస్ప్లే ఉంది.
- Samsung Galaxy A15 5G బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
- రెండర్స్ లో Samsung Galaxy A15 5G డివైజ్ డార్క్ బ్లూ కలర్ లో కనిపిస్తోంది. రిపోర్ట్ ప్రకారం, ఈ డివైజ్ యెల్లో, బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది.
- తక్కువ బడ్జెట్ లో తీసుకురాబడే ఈ ఫోన్ ధర భారత్ లో రూ.15,000 వరకు ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.
- ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.











