
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A55 డివైజ్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A54 కి ఇది సక్సెసర్ గా రానుంది. తాజాగా Samsung Galaxy A55 ఫోన్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్సైట్ పై కనిపించింది. 3సీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A55 3సీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
3C సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Samsung Galaxy A55

- Samsung Galaxy A55 డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పొందింది.
- Samsung Galaxy A55 డివైజ్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని 3సీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Samsung Galaxy A55 హ్యాండ్సెట్ బాక్స్ లో చార్జింగ్ అడాప్టర్ తో రాదు. కస్టమర్లు వేరుగా కొనాల్సి ఉంటుంది.
- చార్జింగ్ స్పెసిఫికేషన్స్ మినహా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ని 3సీ సర్టిఫికేషన్ రివీల్ చేయలేదు.
- ఇటీవలె బయటకు వచ్చిన రూమర్ల ద్వారా Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.
- ఇతర రూమర్ల ద్వారా Samsung Galaxy A55 డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తున్నట్లు తెలిసింది.
- శాంసంగ్ నుంచి ఇంకా గెలాక్సీ ఏ55 లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A54 లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ఉన్నాయి.
- ఓఎస్: Samsung Galaxy A54 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A54 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A54 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- కనెక్టివిటీ: Samsung Galaxy A54 లో డ్యూయల్ సిమ్, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్+గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A54 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బి అట్మాస్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, స్టీరియో స్పీకర్స్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.











