
వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో తన హోమ్ మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ లో ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు, లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న సమయంలో, iQOO Neo 9 సిరీస్ డిజైన్ ఔట్‌లైన్ రివీల్ అయ్యింది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ దీన్ని విడుదల చేసింది. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
రివీలైన iQOO Neo 9 డిజైన్

- టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ iQOO Neo 9 యొక్క స్కీమాటిక్స్ రివీల్ చేసింది. దీంతో డివైజ్ డిజైన్ ఔట్‌లైన్ వివరాలు బయటకు వచ్చాయి.
- స్కీమాటిక్స్ ని గమనిస్తే, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్, న్యారో బెజెల్స్ కనిపిస్తున్నాయి.
- వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
- ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్-టోన్ డిజైన్ కనిపిస్తోంది. ఎడమ వైపున రెండు భారీ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
- iQOO Neo 9 ఫోన్ వివిధ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
- డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, iQOO Neo 9 సిరీస్ 6.78-ఇంచ్ డిస్ప్లే, న్యారో బెజెల్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్లాస్టిక్ ఫ్రేమ్‌కి బదులు మెటాలిక్ ఫ్రేమ్ iQOO Neo 9 లో ఉండనుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
iQOO Neo 9 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- ప్రాసెసర్: iQOO Neo 9 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ తో రావచ్చు.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 సిరీస్ ఫోన్లు 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించవచ్చు.
- డిస్ప్లే: iQOO Neo 9 సిరీస్ ఫోన్లు ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంటాయి.
- ఓఎస్: iQOO Neo 9 లైనప్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తాయి.
రానున్న రోజుల్లో iQOO Neo 9 సిరీస్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తెలియనున్నాయి.











