
షావోమి సబ్-బ్రాండ్ Redmi నవంబర్ 29 వ తేదీన చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Redmi K70 Pro డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో, బెంచ్‌మార్క్ స్కోర్స్ రివీల్ అయ్యాయి. అలాగే మరొక లీక్ లో Redmi K70 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
Redmi K70 సిరీస్ వేరియంట్స్ (లీక్)
- చైనా సామాజిక మాధ్యమం వీబో పై కనిపించిన పోస్ట్ ప్రకారం, Redmi K70 సిరీస్ ఈ క్రింది ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
- Redmi K70 డివైజ్ 16జిబి+256జిబి, 16జిబి+512జిబి, 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది. 256జిబి/512జిబి మోడల్స్ బ్లాక్, సిల్వర్, బ్లూ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 1టిబి మోడల్ బ్లాక్, సిల్వర్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Redmi K70 Pro డివైజ్ 16జిబి+256జిబి, 16జిబి+512జిబి, 24జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ 3 మోడల్స్ బ్లాక్, సిల్వర్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
- పైన తెలిపిన రెండు మోడల్స్ కాకుండా, Redmi K70e కూడా ఒకే రోజున లాంచ్ అవ్వనుందని కన్ఫర్మ్ అయ్యింది.
Redmi K70 Pro గీక్ బెంచ్ వివరాలు (లీక్)
- Redmi K70 Pro డివైజ్ గీక్‌బెంచ్ పై 23117RK66C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. Gizmochina ద్వారా గీక్ బెంచ్ లిస్ట్ బయటకు వచ్చింది.
- Redmi K70 Pro డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2,101 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 6,524 పాయింట్లు నమోదు చేసింది.
- ఆండ్రాయిడ్ 14 ఓఎస్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3, 24జిబి ర్యామ్ మోడల్ ని ఈ టెస్ట్ లో వినియోగించారు.
Redmi K70 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Redmi K70 Pro లో 6.67-ఇంచ్ 2కే ప్యానెల్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi K70 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 3.30 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- సాఫ్ట్‌వేర్: Redmi K70 Pro ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పని చేస్తుంది.
- మెమొరీ: Redmi K70 Pro డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.













