
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ TDRA, SIRIM, FCC, EEC, TKDN, SDPPI, BIS సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా Realme C67 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే పైన పేర్కొన్న అన్ని సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై Realme C67 5G డివైజ్ RMX3890 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ Realme C65 పేరుతో రానుందని ఇంతకు ముందు అనుకున్నారు.
Realme C67 5G ధర, కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ
- Realme C67 5G డివైజ్ 3 మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. అవి: 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ.
- Realme C67 5G డివైజ్ ధర రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- Realme C67 5G డివైజ్ గ్రీన్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
- Realme C67 5G కి సంబంధించి ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ వివరాలు తప్పా ఇతర స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియలేదు. రానున్న రోజుల్లో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
Realme C51 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ 12 నానోమీటర్ ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme C51 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. ఇంకా 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
- ఓఎస్: Realme C51 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Realme C51 డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme C51 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- డైమెన్షన్స్: Realme C51 డివైజ్ 167.2 మి.మీ పొడవు, 76.7 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంది.
- కనెక్టివిటీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Realme C51 డివైజ్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా అల్ట్రాబూమ్ స్పీకర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.











