
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno ఇటీవలె చైనాలో Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Tecno Spark 20 డివైజ్ ని కూడా తీసుకొచ్చింది. అసలైతే, Tecno Spark 20 ఫోన్ టెక్నో కంపెనీ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్టైంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది యూజర్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ఐఫోన్ కెమెరా మాడ్యూల్ మాదిరి డిజైన్ కలిగి ఉంది. రెండు కెమెరా సెన్సర్స్, ఒక ఫ్లాష్ లైట్ ఉన్నాయి. కెమెరా ఐల్యాండ్ కాకుండా ఇంకా టెక్నో స్పార్క్ బ్రాండింగ్ బాటమ్ లో కుడివైపున మూలన ఉంది.
Tecno Spark 20 లో ఐఫోన్ లో పరిచయం చేసిన డైనమిక్ ఐల్యాండ్ మాదిరి ఫీచర్ ఉంది. టెక్నో సంస్థ దీన్ని డైనమిక్ పోర్ట్ అని పిలుస్తోంది. దీని ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకునే వీలుంటుంది. పంచ్ హోల్ కటౌట్ వద్ద ఈ డైనమిక్ పోర్ట్ కనిపిస్తుంటుంది.
Tecno Spark 20 ధర
Tecno Spark 20 ధరను ఇంకా నిర్ణయించలేదు. కానీ, స్పెసిఫికేషన్స్ ని బట్టి ఈ ఫోన్ లో-బడ్జెట్ ఫోన్ అని తెలుస్తోంది. Tecno Spark 20 డివైజ్ గ్రావిటీ బ్లాక్, సైబర్ వైట్, నియాన్ గోల్డ్, మ్యాజిక్ స్కిన్ 2.0 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Tecno Spark 20 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Spark 20 లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: Tecno Spark 20 లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంది.
- ఓఎస్: Tecno Spark 20 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











